మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
       


Sri Shiva Shadakshara stotram – శ్రీ శివ షడక్షర స్తోత్రం

1. రుద్రయామలే

ఓంకారం బిందుసంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః |
కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః || 1 ||

నమంతి ఋషయో దేవా నమంత్యప్సరసాం గణాః |
నరా నమంతి దేవేశం నకారాయ నమో నమః || 2 ||

మహాదేవం మహాత్మానం మహాధ్యానపరాయణమ్ |
మహాపాపహరం దేవం మకారాయ నమో నమః || 3 ||

శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకమ్ |
శివమేకపదం నిత్యం శికారాయ నమో నమః || 4 ||

వాహనం వృషభో యస్య వాసుకిః కంఠభూషణమ్ |
వామే శక్తిధరం దేవం వకారాయ నమో నమః || 5 ||

యత్ర యత్ర స్థితో దేవః సర్వవ్యాపీ మహేశ్వరః |
యో గురుః సర్వదేవానాం యకారాయ నమో నమః || 6 ||

షడక్షరమిదం స్తోత్రం యః పఠేచ్ఛివసన్నిధౌ |
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే || 8 ||

2. శ్రీమచ్ఛంకరచార్యకృతం

ఓంకారం బిందుసంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః |
కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః || 1 ||

ఓం నం,
నమంతి మునయస్సర్వే నమంత్యప్సరసాం గణాః |
నరాణామాదిదేవాయ నకారాయ నమో నమః || 2 ||

ఓం మం,
మహత్తత్త్వం మహాదేవప్రియం జ్ఞానప్రదం పరమ్ |
మహాపాపహరం తస్మాన్మకారాయ నమో నమః || 3 ||

ఓం శిం,
శివం శాంతం శివాకారం శివానుగ్రహకారణమ్ |
మహాపాపహరం తస్మాచ్ఛికారాయ నమో నమః || 4 ||

ఓం వాం,
వాహనం వృషభో యస్య వాసుకిః కంఠభూషణమ్ |
వామే శక్తిధరం దేవం వకారాయ నమో నమః || 5 ||

ఓం యం,
యకారే సంస్థితో దేవో యకారం పరమం శుభమ్ |
యం నిత్యం పరమానందం యకారాయ నమో నమః || 6 ||

యః క్షీరాంబుధి మంథనోద్భవ మహాహాలాహలం భీకరం
దృష్ట్వా తత్రపలాయితాస్సురగణాన్నారాయణాదీన్తదా |
సంపీత్వా పరిపాలయజ్జగదిదం విశ్వాధికం శంకరం
సేవ్యో నస్సకలాపదాం పరిహరన్కైలాసవాసీ విభుః || 7 ||

షడక్షరమిదం స్తోత్రం యః పఠేచ్ఛివసన్నిధౌ |
తస్య మృత్యుభయం నాస్తి హ్యపమృత్యుభయం కుతః || 8 ||

యత్కృత్యం తన్నకృతం
యదకృత్యం కృత్యవత్తదాచరితమ్ |
ఉభయోః ప్రాయశ్చిత్తం
శివ తవ నామాక్షరద్వయోచ్చరితమ్ || 9 ||

శివశివేతి శివేతి శివేతి వా
భవభవేతి భవేతి భవేతి వా |
హరహరేతి హరేతి హరేతి వా
భజమనశ్శివమేవ నిరంతరమ్ || 10 ||

ఇతి శ్రీమచ్ఛంకరచార్యకృత శివషడక్షరీస్తోత్రం సంపూర్ణమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.